నెటిజన్ల కామెంట్స్ పై ఘాటుగా స్పందించిన ప్రియాంక చోప్రా

SMTV Desk 2019-03-12 13:00:51  Priyanka Chopra,

ముంబై, మార్చ్ 12: గెలుపు అనేది ఏ హీరో, హీరోయిన్‌కు అయినా కిక్ ఇచ్చే విషయమే. ఇక బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు ఎదిగిపోయి ఎంతో మంది భామలకు ఆదర్శప్రాయమై పోయింది ప్రియాంక చోప్రా. అయితే గెలవడం అంటే తనకు క్యాండీ క్రష్ గేమ్ ఆడడంలాంటిదని ఆమె పోల్చడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది. “ఒకసారి విజయం సాధించామని అనిపిస్తే ముందు అనుకున్నది సాధించినట్లే. నాకు గెలవడమంటే చాలా ఇష్టం. సక్సెస్ అనేది క్యాండీ క్రష్ గేమ్‌లాంటింది. ఎందులోనైనా నేను ఒకసారి గెలిచానంటే… ఆతర్వాత దాని గురించి ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచించను. ఎప్పటికప్పుడు కొత్త టార్గెట్స్ నిర్దేశించుకొని వాటివైపు ప్రయాణిస్తా”అని చెప్పింది ప్రియాంక. కెరీర్ ప్రారంభంలో ఎంతో కష్టపడ్డ తాను పట్టుదలతో అనుకున్నది సాధించి టాప్ హీరోయిన్‌గా ఎదిగానని ఆమె పేర్కొంది. ఇప్పుడు బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లడంతో తన ఇమేజ్ మరింత పెరిగిందని చెప్పింది ప్రియాంక చోప్రా. ఇక తన డ్రెస్సింగ్ గురించి కామెంట్లు చేసేవాళ్లకు గట్టిగా బదులిచ్చింది ఈ భామ. సముద్రంలోకి దిగి స్విమ్ చేయాల్సినప్పుడు చీర కట్టుకొని దిగలేం కదా అని ఆమె ప్రశ్నించింది. ఎక్కడ ఏ డ్రెస్ సౌకర్యంగా ఉంటుందో అదే వేసుకుంటామని ప్రియాంక పేర్కొంది.