''డబ్లుడబ్లుడబ్లు''కు 30 ఏళ్ళు

SMTV Desk 2019-03-12 12:31:13  Googles Logos Go Retro To Celebrate 30 Years Of The World Wide Web, World Wide Web, Google Dedicates Doodle

మార్చ్ 12: నేటితో వరల్డ్‌ వైడ్‌ వెబ్‌(డబ్లుడబ్లుడబ్లు)కు 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా దిగ్గజ సాఫ్ట్ వేర్ సంస్థ గూగుల్ మంగళవారం నాడు ప్రత్యేక డూడుల్‌ను రూపొందించింది. ఆంగ్ల శాస్త్రవేత్త టిమ్‌ బెర్నర్స్‌ లీ 1989 మార్చి 12న దీన్ని రూపొందించారు. స్విట్జర్లాండులోని జెనీవాలో సిఈఆర్‌ఎన్‌ సంస్థలో టిమ్‌ పనిచేస్తుండగా 1990లో మొదటి వెబ్‌ బ్రౌజర్‌ను రూపొందించడం ప్రారంభించారు. అనంతరం 1991లో తొలి వెబ్‌ బ్రౌజర్‌ బయటకు విడుదలైంది. 1991 ఆగస్టు తర్వాత సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి వచ్చింది. దీంతో సమాచార సాంకేతిక రంగంలో వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ప్రపంచంలో ఎక్కడైనా , ఎప్పుడైనా ,ఏదైనా సమాచారం తెలుసుకునే వెసులుబాటును వరల్డ్‌ వైడ్‌ వెబ్‌ కల్పిస్తుంది.