ధోని లేనందువల్లే మ్యాచ్ ఓడిపోయాం : మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ

SMTV Desk 2019-03-12 12:26:46  india vs australia, 4th odi, virat kohli, mahendra singh dhoni, indian former cricketer Bishan Singh Bedi

న్యూఢిల్లీ, మార్చ్ 12: ఆదివారం భారత్, ఆసిస్ మధ్య జరిగిన నాలుగో వన్డేలో ధోనీ లేకపోవడం కారణంగానే మ్యాచ్ ఓడిపోయాం అని మాజీ క్రికెటర్ బిషన్ సింగ్ బేడీ అభిప్రాయపడ్డారు. అలాగే చివరి రెండు మ్యాచ్ లలో ధోనికి ఎందుకు విశ్రాంతి ఇచ్చారని బిషన్ సింగ్ ప్రశ్నించారు. ధోని లేని లోటు ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనబడిందని, వికెట్ల వెనుకాలా ఉండి ప్రశాంతంగా అతను రచించే వ్యూహాలు ఈ మ్యాచ్‌లో మిస్సయ్యాయని అన్నారు. ధోనికి విశ్రాంతినివ్వడమే ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పారు. కీపర్‌గా, బ్యాట్స్‌మెన్‌, దాదాపు సారథిగా అతని సేవలు జట్టు కోల్పోయిందని అభిప్రాయపడ్డారు. ధోని యువకుడు కాకపోవచ్చు. కానీ అతను జట్టుకు అవసరమన్నారు. అతను ప్రశాంతంగా ఆటగాళ్లను ప్రభావితం చేయగలడని చెప్పారు. ప్రస్తుత సారథికి కూడా అతని సూచనలు అవసరమన్నారు.