స్పోర్ట్స్ స్కూల్ నోటిఫికేషన్ల ఆహ్వానం

SMTV Desk 2017-06-01 18:25:25  hakimpet telangana sports school,addistions started,tsss, mandal,dist,state,june22, june29,july8,august3to12

హైదరాబాద్, జూన్ 1 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంమాక్షంలో హాక్కీంపేట్ లోని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ లో విద్యార్ధుల ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. నాలుగో తరగతిలో చేరే విద్యార్ధులు దీనికి అర్హులు, ఈ విద్యార్ధులకు అడ్మిషన్లు అందిస్తున్నారు. 20 మంది బాలికలు.. 20 మంది బాలురు మొత్తం నలభై మంది విద్యార్ధులను ఈ పాఠశాలకు ఎంపిక చేస్తారు. మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో మూడు అంచనాల ప్రక్రియ ప్రకారం ఈ ఎంపిక జరుగుతుంది. మండల సెలక్షన్లు జూన్ 22, మండల విద్యాశాఖాధికారి, జిల్లా స్థాయి ఎంపికలను జూన్ 29 నుంచి జూలై 8 వరకు మధ్య జిల్లాకి చెందిన డిప్యూటీ స్పోర్ట్స్ అధికారి నిర్వహిస్తారు. ఈ మేరకు రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ పోటీలను టీఎస్ఎస్ఎస్ ఆగష్టు 3 నుండి 12 వరకు నిర్వహిస్తారు.