అందుబాటులోకి బజాజ్ పల్సర్ 150 న్యూ మోడిఫైడ్ వెర్షన్ బైక్

SMTV Desk 2019-03-12 12:25:04  Bajaj Pulsar 150, Avery Dennison Edition By Stealth Wraps,

మార్చ్ 12: బజాజ్ పల్సర్ 150 అవేరీ డెన్నిసన్ గ్లోస్ స్కై బ్లూ ర్యాప్ వెర్షన్ మోడిఫైడ్ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. స్కైబ్లూ, నలుపు రంగులతో ఈ బైక్ అందరినీ ఆకట్టుకుంటోంది. హెడ్‌లైట్ నలుపు రంగులో ఉంటుంది. బైక్ మిగతా భాగం స్కైబ్లూ రంగులో కనిపిస్తుంది. రియర్ అలాయ్ వీల్ కూడా ఈ రంగులోనే ఉంటుంది. మీ బైక్‌ను కూడా ఇలా ముస్తాబు చేసుకోవాలంటే రూ.6,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది.
బజాజ్ పల్సర్ 150 బైక్‌లో 149 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. దీని ధర రూ.87,000 (ఎక్స్‌షోరూమ్, డ్యూయెల్ డిస్క్ ఏబీఎస్). ఈ బైక్ తక్కువ ధరలో కూడా అందుబాటులో ఉంది. పల్సర్ నియాన్ ఎడిషన్ బైక్‌ను రూ.65,000కు (ఎక్స్‌షోరూమ్) కొనుగోలు చేయవచ్చు.
బైక్ ప్రత్యేకతలు
ఇంజిన్:149 సీసీ సింగిల్ సిలిండర్
మాగ్జిమమ్ పవర్: 14 హెచ్‌పీ@8000 ఆర్‌పీఎం
మాగ్జిమమ్ టార్క్: 13.4 ఎన్ఎం@6000 ఆర్‌పీఎం

గేర్లు: 5
ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ: 15 లీటర్లు
టాప్ స్పీడ్: గంటకు 115 కిలోమీటర్లు