మహాత్మా గాంధీ ‘దండి యాత్ర’కు 89 ఏళ్ళు

SMTV Desk 2019-03-12 11:57:37  DandiMarch, mahatma gandhi, non-violent protest, British policies on salt

న్యూఢిల్లీ, మార్చ్ 12: జాతిపిత మహాత్మా గాంధీ స్వాతంత్ర్య సమరంలో దండి యాత్రకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీన్ని ఉప్పు సత్యాగ్రహం అని కూడా అంటారు. 1930 మార్చ్ 12న ఉప్పు తయారీపై బ్రిటిష్ ప్రభుత్వం పన్ను విధించడాన్ని నిరసిస్తూ మహాత్మా గాంధీ ‘దండి యాత్ర’కు పిలుపు నిచ్చారు. దండి మార్చ్‌లో మ‌హాత్మా గాంధీ పాల్గొన్న ఓ వీడియోను మంగళవారం కాంగ్రెస్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్టు చేసింది. భార‌త స్వాతంత్య్ర ఉద్య‌మంలో దండి యాత్ర కీల‌క పాత్ర పోషించిన విషయం తెలిసిందే. బ్రిటీష‌ర్ల‌పై ఇది అహింసా పోరాటం అని ట్వీట్‌లో కాంగ్రెస్ నేతలు తెలిపారు.