బాలాకోట్ దాడిలో 18మంది జైషే సీనియర్ కమాండర్లు మృతి!

SMTV Desk 2019-03-12 11:53:37  balakot attack, indian airforce, pakistan terrorists, jaish e mohammed senior commands

బాలాకోట్, మార్చ్ 12: భారత వైమానిక దాళాలు పాక్ లోని బాలాకోట్ లో ఉన్న ఉగ్రవాద సంస్థలపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిలో జైషేకు చెందిన 18మంది సీనియర్ కమాండర్లు మృత్యువాత పడినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. వీరంతా 200మందికిపైగా ఉగ్రవాదుకు శిక్షణ ఇచ్చేందుకు అక్కడికి వివిధ ప్రాంతాల నుంచి చేరుకున్నారని వెల్లడవుతోంది. తాజాగా బాలాకోట్ దాడులకు సంబంధించిన ఆడియో ఒకటి బయటపడింది. అందులో పాక్ ఆర్మీకి చెందిన ఇరువురు మాట్లాడుకుంటున్నట్లు అందులో ఉంది. చనిపోయిన వారి పేర్లను కూడా వారిద్దరు రహస్యంగా పంచుకున్నట్లు అందులో అర్థమవుంతోంది. మొత్తానికి భారత్ వైమానిక దాడుల్లో 263 మంది ఉగ్రవాదులు మరణించినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేశాయి. మృతుల్లో దాదాపు 18 నుంచి 20 మంది ఉగ్రవాదులకు సాయం అందించేందుకు వచ్చిన క్షురకులున్నారని సమాచారం. ఉగ్రవాదుల కదలికలను ఐదు రోజుల పాటు గ్రౌండ్ ఇంటెలిజెన్స్ ద్వారా పసిగట్టిన తర్వాత ఫిబ్రవరి 26న తెల్లవారుజామున మెరుపు దాడులతో విరుచుకుపడినట్టు వైమానిక దళ వర్గాలు చెబుతున్నాయి.