యుపిలో దారుణ సంఘటన.. గర్భిణి ఆన్‌లైన్‌లో ప్రసవ వీడియో చూస్తూ

SMTV Desk 2019-03-12 11:16:21  online video,

లక్నో, మార్చ్ 12: యుపిలోని గోరఖ్ పూర్ పరిధిలోని బహ్రయిచ్ లో దారుణ సంఘటన వెలుగుచూసింది. ఓ గర్భిణి ఆన్‌లైన్‌లో ప్రసవ వీడియో చూస్తూ స్వయంగా ప్రసవం చేసుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయింది. స్థానికంగా నివాసముంటూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ఓ యువతి తన ప్రియుడి వల్ల గర్భం దాల్చింది. దీంతో స్థానికులకు తన గర్భం గురించి అనుమానం రాకుండా అక్కడి నుంచి వేరే ప్రాంతానికి మకాం మార్చింది. అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటుంది. తన గర్భం గురించి బయటకు తెలియకుండా ఆన్‌లైన్‌లో ప్రసవం చేసే వీడియో చూస్తూ స్వయంగా ప్రసవానికి యత్నించింది. దాంతో తీవ్ర రక్తస్రావం కావడం వల్ల మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.