గాయంతో అర్థసెంచరీ సాధించిన విలియమ్సన్‌

SMTV Desk 2019-03-12 11:15:25  Bangladesh vs newzealand , 2nd test, Williamson

వెల్లింగ్టన్‌, మార్చ్ 12: న్యూజిలాండ్‌, బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్ట్ లో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ మైదానంలోనే గాయంతో భాదపడ్డాడు. బంగ్లాదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌ మూడో రోజు ఆటలో విలియమ్సన్‌ ఫీల్డింగ్‌ బంతిని ఆపే క్రమంలో అతని ఎడమ భుజానికి గాయమైంది. అయితే ఆ నొప్పి భరించలేక మైదానంలో ఫిజియోలు పలుమార్లు ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ నొప్పి తగ్గలేదు. దీంతో అతన్ని ఆసుపత్రికి తరలించి స్కానింగ్‌ తీయంచగా మామూలు గాయమేనని తేలింది. నొప్పితోనే బ్యాటింగ్‌ చేసిన విలియమ్సన్‌ ఈ మ్యాచ్‌ అర్థసెంచరీ సాధించాడు.