నోట్ల రద్దు ప్రకటించే ముందు కేంద్రాన్ని హెచ్చరించాం : ఆర్‌బిఐ

SMTV Desk 2019-03-12 11:04:33  rbi, central government, bjp, narendra modi, reserve bank of india, demonetization

ముంబై, మార్చ్ 12: కేంద్ర ప్రభుత్వానికి నోట్ల రద్దు ప్రకటన చేయడానికి ముందు ఆర్‌బిఐ హెచ్చరించింది అని స్పష్టం చేసింది. దేశీయ ఆర్థిక వృద్ధిపై డీమానిటైజేషన్ ప్రతికూల ప్రభావం స్వల్పకాలికంగా ఉంటుందని, నల్లధనానికి చెక్ పెట్టడంలో ఈ నిర్ణయం అంతగా ప్రభావం ఉండకపోవచ్చని ఆర్‌బిఐ బోర్డు బీజేపీ సర్కార్ ను హెచ్చరించింది. కాగా నోట్ల రద్దు ప్రకటన సమయంలో ఆర్‌బిఐ బోర్డులో ప్రస్తుత గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఉన్నారు. ఆర్‌టిఐ(సమాచార హక్కు చట్టం)కు సమాధానంగా ఆర్‌బిఐ ఈ విషయాలను వెల్లడించింది. 2016 నవంబర్ 8న డిమానిటైజేషన్ నిర్ణయం ప్రకటన చేయడానికి రెండున్నర గంటలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ సమావేశమయ్యారని ఆర్‌బిఐ వెల్లడించింది. దేశంలో 86 శాతం చలామణిలో ఉన్న రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడానికి ప్రధాన కారణాల్లో ఒకటి నల్లధనాన్ని నియంత్రించడం. ఆర్‌బిఐ బోర్డు మీటింగ్ మినిట్స్ ప్రభుత్వ డిమానిటైజేషన్ నిర్ణయాన్ని అంగీకరించింది. ఆ సమయంలో ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్, ఆర్థఖి వ్యవహారాల కార్యదర్శి శక్తికాంత దాస్ ఆధ్వర్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమయంలో బోర్డు సమావేశంలో ఆర్థిక సేవల కార్యదర్శి ఎ.సి.దుగ్గల్, ఆర్‌బిఐ డిప్యూటీ గవర్నర్‌లు ఆర్.గాంధీ, ఎస్.ఎస్.ముంద్రా ఉన్నారు. అయితే ప్రస్తుతం ముంద్రా, గాంధీలు బోర్డులో లేరు. ఆర్‌బిఐ గవర్నర్‌గా శక్తికాంత దాస్‌ను 2018 డిసెంబర్‌లో నియమించారు.