టీటీడీపై వేసిన పిటిషన్ ను స్వీకరించిన సుప్రీం

SMTV Desk 2019-03-12 11:02:57  tirumala tirupati devasthanm, supreme court, ttd, bjp mp subrahmanya swamy

విజయవాడ, మార్చ్ 12: తిరుమల తిరుపతి దేవస్థానంపై ప్రముఖ న్యాయవాది, బిజెపి ఎంపి సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటీషన్‌ని తాజాగా సుప్రీం కోర్టు స్వీకరించింది. ఈ పిటిషన్ పై ఆయన ఏప్రిల్ 6 న తన వాదనను వినిపిస్తానని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.... హైకోర్టు ఆధ్వర్యంలో ఆడిట్‌ కమిటీని నియమించాలని, తిరుమల దేవస్థానం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది అంటూ, దేవాలయాలు రాష్ట్రం ఆధీనంలో ఉండొద్దు అని పేర్కొన్నారు. తిరుమలకు వచ్చిన ఆదాయాన్ని ప్రభుత్వం వాడుకుంటుందని, కనీసం మౌలిక సదుపాయాల గురించి కూడా పట్టించుకోవటంలేదు అని మండిపడ్డారు. ఈ విషయంలో చంద్రబాబు వైఖరి హాస్యాస్పదంగా ఉందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని కూడా చెప్పాము, ఐనా కానీ చంద్రబాబు నాలుగేళ్లు బిజెపితో కలిసి ఉండి ఇప్పుడు కాంగ్రెస్‌ పంచన చేరారని ఆయన విమర్శించారు.