అతిగా మొబైల్ ఫోన్ వాడి కంటి చూపును కోల్పోయిన చిన్నారి!

SMTV Desk 2019-03-12 11:00:49  a child lost her eyes due to using mobile phone, thailand

థాయిలాండ్‌, మార్చ్ 12: థాయిలాండ్‌లో ఓ నాలుగేళ్ల చిన్నారికి మొబైల్ ఫోన్ అతిగా వాడి తన కంటిచూపును పోగొట్టుకుంది. థాయిలాండ్‌లోని ఓ ప్రాంతంలో దాచర్ నుయ్‌స్టిక్కర్ చ్వాయ్‌డువాంగ్ అనే వ్యక్తి తన కూతురికి రెండేళ్ల వయసు నుంచే మొబైల్ ఫోన్ అలవాటు చేశాడు. చిన్నారి దాన్ని తప్ప మరో ఆటవస్తువును ముట్టుకునేది కాదు. పొద్దస్తమానం దాంతోనే గడిపేది. నాలుగో ఏట పడేసరికి కంటి సమస్యలు మొదలయ్యాయి. మసక చూపు వచ్చేసింది. దీంతో కళ్లద్దాలు కొనిపెట్టారు. అయినా చూపు రోజురోజుకు మందగించింది. ఆమెకు ఆంబ్లియోపియా(లేజీ ఐ) అనే వ్యాధి సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆ వ్యాధి వస్తే కళ్లద్దాలు కూడా పనిచేయవు. దీంతో ఆ పాపకు సర్జరీ చేసి, చూపు పునరుద్ధరించారు. ఈ విషయాన్ని ఆమె తల్లిదండ్రులు సోషల్ మీడియా ద్వారా తెలిపి తల్లిదండ్రులను హెచ్చరిస్తున్నారు.