అంతర్జాతీయ ఉగ్రవాది మసూద్ అజహర్ విషయంలో మళ్ళీ పాత పాటే పాడుతున్న చైనా

SMTV Desk 2019-03-12 07:57:02  masood azhar, pakistan terrorist, jai-she mohammed, un council

బీజింగ్, మార్చి 11: మరో రెండు రోజుల్లో మసూద్ అజహర్ పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేస్తూ.... ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో తీర్మానం రానున్న నేపథ్యంలో చైనా తీరు తీవ్ర వ్యతిరేకతకు దారి తీస్తుంది. ఈ తీర్మానంపై ఇప్పటికీ తన వైఖరి ఏంటో చెప్పని చైనా... భారత్, పాకిస్థాన్ దేశాలు ఎలా వ్యవహరించాలో మాత్రం చెబుతోంది.

ఇరుదేశాల మధ్య నెలకొన్న వివాదాలకు బాధ్యతాయుతమైన పరిష్కారం రావాలంటే చర్చలే మార్గమని పాతపాటే పాడింది. పుల్వామా దాడి అనంతరం భారత్, పాక్ మధ్య చర్చల్లో భద్రతాపరమైన అంశాలే ప్రధాన అంశాలుగా ఉండాలని సూచించింది. కాగా, దాయాది దేశాల గొడవల్లో చైనా మధ్యవర్తిత్వం వహించబోతోందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. దీనిపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధిలు కాంగ్ మాట్లాడుతూ..... గతంలో కూడా తాము ఇరు దేశాల మధ్య స్నేహసంబంధాల కోసం ఎంతో కృషి చేశామని చెప్పారు.