తగ్గుతున్న ఇమ్రాన్ ఖాన్ ఆదాయం

SMTV Desk 2019-03-12 07:48:43  pakistan president, imran khan, imran khan annual income decreased

హైదరాబాద్, మార్చ్ 11: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆదాయం తగ్గుతున్నట్లు ఆదేశానికి చెందని డాన్‌ పత్రిక తన కథనంలో రాసింది. ఆ దేశ ప్రతిపక్ష పార్టీ నేతల ఆస్తులు మాత్రం రెట్టింపు అవుతున్నాయి కాని ఇమ్రాన్ ఆదాయం మూడు కోట్ల రూపాయల మేరకు తగ్గినట్లు తెలుస్తుంది. 2015లో ఇమ్రాన్ రాబడి 3.56 కోట్లు కాగా, అది 2016లో 1.29 కోట్లకు పడిపోయింది. ఇక 2017లో ఆ ఆదాయం కాస్త 0.47 కోట్లు పడిపోయినట్లు డాన్ రిపోర్ట్ వెల్లడించింది. జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన షాబాజ్ షరిఫ్ ఆస్తులు మాత్రం 0.76 కోట్ల నుంచి కోటి వరకు పెరిగాయి. మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారి ఆస్తులు 10 కోట్ల నుంచి 13.4 కోట్లకు చేరింది. జర్దారికి సుమారు 7వేల ఎకరాల భూమి ఉన్నట్లు తెలుస్తోంది.