మూడేళ్ళ కూతురుతో పోర్న్ వీడియోలు...ఆ ప్లేస్ ను కత్తెరతో కట్ చేసి...!

SMTV Desk 2019-03-12 07:44:38  mother cut her daughter ovary, Britain, Uganda

బ్రిటన్, మార్చ్ 11: ఓ తల్లి తన కూతురుపై పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. అతి నీచంగా మూడేళ్ళ బాలిక అయిన తన కూతురుతో పోర్న్ వీడియోలు తీసింది. పూర్తి వివరాల ప్రకారం...ఉగాండాకు చెందిన ఓ మహిళ తన కూతురితో పోర్న్ వీడియోలు తీయడానికి సిద్ధపడింది. కెమెరాతో చైల్డ్ పోర్నోగ్రఫీ తీసిన ఆమె, బాలిక ఐడెంటిటీ స్పష్టంగా కనిపించడం లేదని దారుణానికి ఓడిగట్టింది. జననేంద్రియాన్ని కత్తెరతో కత్తిరించింది. తీవ్రంగా గాయపడి బాలికకు రక్తస్రావం అవుతుండటంతో అనంతరం తానె ఆసుపత్రికి తీసుకువెళ్లింది. వైద్యులు ఏమైందని అడిగితే, కత్తి పడి గాయం అయిందని చెప్పింది. వైద్యులు చికిత్స చేసిన తరువాత అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆమెను విచారణ చేయడంతో తానే ఈ గాయం చేసానని అంగీకరించింది. అయితే తాను ఈ పని కావాలని చేయలేదని, గతంలో పాపకి యాక్సిడెంటల్‌గా గాయం అయిందని దానిని మాన్పించడానికే ఈ పని చేశానని మరో కథ అల్లింది. కానీ అది నిజం కాదని పోలీసులు తేల్చారు. మరో విషయం ఏమిటంటే, ఆ తల్లి ఇలా ప్రవర్తిస్తున్నట్లు బాలిక తండ్రికి తెలియదు. అతను ఆఫీసుకు వెళ్లిన సమయంలో బాలికపై ఈ దురాగతానికి పాల్పడేది. మాతృత్వానికి మచ్చ తీసుకువచ్చిన సదరు మహిళను కోర్టు కఠినంగా శిక్షించింది. 11 యేళ్లు కఠిన కారాగార శిక్ష విధించింది.