వన్డేలలో చెత్త రికార్డు నమోదు చేసిన టీంఇండియా

SMTV Desk 2019-03-12 07:37:35  india vs australia, 4th odi, virat kohli, odi, record

న్యూఢిల్లీ, మార్చ్ 11: మొహాలీ వేదికగా ఆదివారం భారత్, ఆసిస్ జట్ల మధ్య జరిగిన నాలుగో వన్డేలో టీంఇండియా ఘోరంగా పరాజయ పాలైంది. ఈ మ్యాచ్ లో భారత్ 358 పరుగుల భారీ స్కోరు సాధించినప్పటికి వాటిని కాపాడుకోవడంలో విఫలమయ్యింది. ఇలా 350 కి పైగా పరుగులు సాధించినప్పటికీ భారత్ ఓటమి పాలవ్వడం ఇదే మొదటిసారి. గతంలో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసిస సందర్భాల్లో ఐదుసార్లు 350 పైచిలుకు పరుగులు సాధించింది. అయితే ఇలా భారీ స్కోరు సాధించిన ప్రతిసారీ భారత్ దే విజయం. కాని స్వదేశంలో ఆసిస్ పై జరిగిన నాలుగో వన్డేలో మొదటిసారిగా 358 ని కాపాడుకోలేక ఓటమిపాలయ్యింది. దీంతో భారత్ వన్డే చరిత్రలో 350 పరుగులను కాపాడుకోలేని మ్యాచ్ గా మొహాలీ వన్డే నిలిచింది.