తమిళ నటుడు విశాల్ కి గాయాలు!

SMTV Desk 2019-03-12 07:35:38  Vishal,

చెన్నై, మార్చ్ 11:తమ ఫాన్స్ ని మెప్పించేందుకు స్టార్ హీరోలు ఎంత రిస్క్ తీసుకోవడానికైనా వెనుకాడరు. ఈ క్రమంలో యాక్షన్ సన్నివేశాలు, స్టెప్పులు వేసేటప్పుడు హీరోలు గాయాలపాలు కావడం కామన్ గా జరుగుతూనే ఉంటుంది. తాజాగా ప్రముఖ తమిళ నటుడు విశాల్ కు కూడా ఇదే ఎదురైంది.

తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమాను తమిళంలో అయోగ్య గా విశాల్ రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఓ సాంగ్ ను షూట్ చేస్తున్న సమయంలో విశాల్ గాయపడ్డాడు. ఒక కష్టమైన స్టెప్ ను ప్రాక్టీస్ చేసే సమయంలో అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆయన మోచేతికి, కాలికి గాయాలు అయ్యాయి.దీంతో ఈ పాట చిత్రీకరణను నిలిపివేసినట్లు తెలుస్తోంది.

విశాల్ కోలుకున్న తరువాత సినిమా షూటింగ్ పూర్తి చేస్తారు. ఈ సినిమాలో విశాల్ సరసన హీరోయిన్ గా రాశిఖన్నా నటిస్తోంది. వెంకట్ మోహన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను విశాల్, జ్ఞానవేల్ రాజా సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విషయం తెలుసుకున్న విశాల్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.