నిరుద్యోగ సమస్య : తలారీ ఉద్యోగానికి వందల మంది దరఖాస్తు

SMTV Desk 2019-03-12 07:34:30  srilanka unemployment, talari job notifications

శ్రీలంక, మార్చ్ 11: దేశం ఏదైనా కాని సమస్య మాత్రం ఒక్కటే...నిరుద్యోగం. ఎన్ని ప్రభుత్వాలు మారినా నిరుద్యోగం అనేది ఓక మారని సమస్యగా అలాగే ఉంటుంది. ఇక నిరుద్యోగులు ఉద్యోగం కోసం అది ఏ ఉద్యోగం అయినా వెనుకాడటం లేదు. చివరికి దోషిని ఉరికంబం ఎక్కించే తలారీ ఉద్యోగానికి కూడా సిద్దమవుతున్నారు. నిజానికి ఈ ఉద్యోగం చేయడానికి ఎవరూ ముందుకు రారు. కానీ శ్రీలంకలో మాత్రం తలారీ ఉద్యోగం కోసం వందల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఆ దేశంలో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్యకు ఈ ప్రకటన సాక్ష్యంగా నిలుస్తోంది. మాదక ద్రవ్యాలను రవాణా చేసేవారికి, హంతకులకు, మహిళలను లైంగికంగా వేధించిన వారికి ఉరిశిక్ష విధిస్తుంది ఇక్కడి న్యాయస్థానం. ఇప్పటి వరకు 48 మంది ఖైదీలను ఉరితీసింది న్యాయస్థానం. అయితే ఈ మధ్య ఖైదీలను ఉరితీసేందుకు తలారీలు లేని కారణంగా చాలా మంది ఖైదీలు జైళ్లలోనే మగ్గుతున్నారు. దాంతో తలారి అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ ఇవ్వాల్సి వచ్చింది జైళ్ల శాఖకు. అయితే ఆశ్చర్యకరంగా ఈ ఉద్యోగం కోసం వందలాది దరఖాస్తులు వచ్చాయి. ఉద్యోగానికి అప్లై చేసుకున్న వారిలో ఓ అమెరికన్ పౌరుడు కూడా ఉండడం విశేషం. ఇంతకీ జైళ్ల శాఖ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం.. 1971 తరువాత శ్రీలంకలో ఏ ఖైదీని ఉరి తీయలేదట. 43 ఏళ్లుగా అక్కడి ఖైదీలు జైళ్లలోనే మగ్గుతున్నారు.