ఇండియా టుడే సర్వే లో రాహుల్ వైపే మొగ్గు

SMTV Desk 2019-03-12 07:24:57  rahul gandhi,

న్యూ ఢిల్లీ, మార్చ్ 11: రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కి బీజేపీ కి హోరా హోరి పోటీ తప్పదని తెలిసిందే అయితే తాజాగా ఓ సర్వే చేసిన ప్రీ పోల్స్ ఈ విదంగా ఉన్నాయ్ .. భారత ప్రధాని నరేంద్ర మోదీ కంటే కాంగ్రెస్ అధినేత రాహల్ గాంధీకే ఎక్కువ జనాకర్షణ ఉందని పీఎస్ఈ (పొలిటికల్ స్టాక్ ఎక్స్ఛేంజ్) సర్వేలో వెల్లడైంది. ప్రధానిగా ఎవరిని కోరుకుంటున్నారంటూ ఇండియా టుడే నిర్వహించిన సీఎస్ఈ సర్వేలో ఎస్సీలు, ముస్లింలలో అధికులు రాహుల్ గాంధీ వైపే మొగ్గు చూపారు.

ఈ సర్వే లో .. రాహుల్ ప్రధాని కావాలని 44 శాతం మంది ఎస్సీలు కోరుకోగా.. 41 శాతం మంది మోదీ వైపు మొగ్గు చూపారు. ముస్లింలలో ఏకంగా 61 శాతం మంది రాహుల్ గాంధీకే జై కొట్టారు. కేవలం 18 శాతం మంది ముస్లింలు మాత్రమే మోదీ మరోసారి ప్రధాని కావాలని ఆకాంక్షించారు. జనవరిలో నిర్వహించిన సర్వే కంటే తాజా సర్వేలో రాహుల్ పాప్యులారిటీ 4 శాతం పెరిగింది. ఇదే సమయంలో మోదీ పాప్యులారిటీ కేవలం ఒక శాతం మాత్రమే పెరిగింది.