దూకుడు పెంచిన జనసేన ..

SMTV Desk 2019-03-12 07:18:28  Janasena, Pawan Kalyan,

హైదరాబాద్, మార్చ్ 11: నిన్న ఎన్నికల షెడ్యూల్ విడుదలైన మరుసటి రోజే జనసేన పార్టీ దూకుడు పెంచింది. ఈ రోజు ఏకంగా 32 అసెంబ్లీ స్థానాలు, 9 లోక్ సభ స్థానాలకు జనసేనాని పవన్ కల్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు. పార్టీ జనరల్ బాడీ సమావేశంలో అభ్యర్థులను ఎంపిక చేశామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన అధికారిక ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. నిజాయతీ, నిబద్ధత కలిగిన వ్యక్తులను టికెట్లను ఇస్తున్నామని చెప్పారు. ఎవరెవరికి టికెట్లు వచ్చాయో కాసేపట్లో పార్టీ నుంచి ప్రకటన వెలువడనుంది.