ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం

SMTV Desk 2019-03-11 14:47:10  delhi, vikas bhavan fire accident

న్యూఢిల్లీ, మార్చ్ 11: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఢిల్లీలోని వికాస్‌ భవన్‌ ఆరో అంతస్తులోని ఓ అపార్ట్ మెంట్ లో ఎయిర్‌ కండిషనర్‌ లో సాంకేతిక లోపం తలెత్తడంతో అగ్నిప్రమాదం జరిగినట్టు సమాచారం. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే ఐదు అగ్నిమాపక యంత్రాలను ఘటనా స్థలానికి తరలించామని ఢిల్లీ పైర్‌ సర్వీస్‌ అధికారులు వెల్లడించారు. కాగా ఈ ప్రమాదంలో ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు వెల్లడికాలేదు. కాగా ఈనెల 6న దక్షిణ ఢిల్లీలోని సీజీఓ కాంప్లెక్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓ సీఐఎస్‌ఎఫ్‌ ఎస్‌ఐ మరణించగా, పలు కీలక పత్రాలు, ఫైళ్లు దగ్ధమయ్యాయి.