మరో సారి భయపెట్టడానికి వస్తున్న లారెన్స్

SMTV Desk 2019-03-11 14:45:40  larens, kanchana 3

హైదరాబాద్, మార్చ్ 11: హారర్ థ్రిల్లర్ చిత్రాలను తెరకెక్కించడంలోను .. ఆ చిత్రాలలో కథానాయకుడిగా మెప్పించడంలోను ప్రముఖ నటుడు లారెన్స్ సిద్ధహస్తుడు. గతంలో ఆయన నుంచి వచ్చిన హారర్ థ్రిల్లర్ చిత్రాలు తమిళంలో భారీ విజయాలను అందుకున్నాయి. తెలుగులోను భారీ వసూళ్లను కొల్లకొట్టాయి.

ఈ క్రమంలో ఆయన నుంచి మరో హారర్ థ్రిల్లర్ మూవీ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా కాంచన 3 సినిమాను పూర్తి చేసిన లారెన్స్, ఈ సినిమాకి విడుదల తేదీని ఖరారు చేసేశాడు.

ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమా భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓవియా .. వేదిక ఈ సినిమాలో లారెన్స్ సరసన కనిపించనున్నారు. ఇంతవరకూ లారెన్స్ చేస్తూ వచ్చిన సినిమాలకి మించి ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఈ సారి లారెన్స్ ఏ స్థాయిలో భయపెడతాడో చూడాలి మరి.