పార్టీ నేతలతో అత్యవసర సమావేశమైన జనసేనాని

SMTV Desk 2019-03-11 14:44:57  janasena, pawan kalyan, ap elections

అమరావతి, మార్చ్ 11: ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ ముఖ్యనేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భాగంగా వారితో ఎంపి, ఎమ్మెల్యె అభ్యర్థుల ఎంపికపై స్క్రీనింగ్‌ కమిటితో చర్చలు జరిపారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమంటూ వచ్చిన 1200 మంది ఆశావహుల బలాబలాలపై చర్చించారు. అంతేకాక మిత్రపక్షాలైన వామపక్షాలకు కేటాయించాల్సిన స్థానాలపై కూడా చర్చలు జరిపారు. మరోవైపు, ఈనెల 14న రాజమండ్రిలో నిర్వహించనున్న పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్లపై పవన్ కు పార్టీ నేతలు వివరించారు.