ఈ విజయం సినీ పరిశ్రమ మహిళలకి అంకితం

SMTV Desk 2019-03-11 12:52:45  Hema, maa ennikalu, Elections,

హైదరాబాద్, మార్చ్ 11: ఆదివారం జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ పాలకవర్గ ఎన్నికల్లో సీనియర్ నటుడు నరేష్ ప్యానెల్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో మా ఉపాధ్యక్షురాలిగా హేమ విజయ దాంక మోగించింది . ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఆమె విజయం సాధించింది. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, విజయం సాధించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది. నలుగురు మగవాళ్లను ఓడించి తాను ఈ ఎన్నికల్లో గెలుపొందానని తెలిపింది. ఈ విజయాన్ని సినీ పరిశ్రమలోని మహిళలకు అంకితం చేస్తున్నానని... వారి మద్దతు లేకుండా తాను ఈ విజయాన్ని సాధించలేనని చెప్పింది. ఏవైతే హామీలను ఇచ్చానో... వాటిని నెరవేర్చేందుకు కృషి చేస్తానని తెలిపింది.