బుమ్రా సిక్స్...కోహ్లీ రియాక్షన్

SMTV Desk 2019-03-11 12:04:31  india vs australia, 4th odi, virat kohli, jaspreet bumrah

మొహాలి, మార్చ్ 10: భారత్, ఆసిస్ మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా పంజాబ్ లోని మొహాలీ స్టేడియం వేదికగా జరిగిన నాలుగో వన్డేలో ఆసిస్ విజయం సాధించింది. నాల్గో వన్డేలో మొదట టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ బ్యాటింగ్ ఎంచుకొని ఆసిస్ కు 359 పరుగుల లక్ష్యాన్ని ముందుంచారు. అయితే మ్యాచ్ ఓడిపోయినప్పటికీ..యువ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌తో బుమ్రా తన కెరీర్‌లో 100 అంతర్జాతీయ మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. అయితే సాధారణంగా బౌలింగ్‌తో ఆకట్టుకొనే బుమ్రా.. ఈ మ్యాచ్‌లో ఆడిన ఒక బంతిని సిక్సర్‌గా మలిచి.. తన వన్డే కెరీర్‌లో తొలి సిక్సర్‌ని నమోదు చేసుకున్నాడు. బుమ్రా చివరి బంతికి సిక్సర్ కొట్టడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఆనందంతో గంతులు వేశాడు. కోహ్లీ ఆనందంతో చప్పట్లు కొడుతూ.. ఎగురుతుండగా తీసిన వీడియోని బీసీసీఐ ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.