అందుకే వైసీపీ లో చేరాను .. అలీ ఆసక్తికర వ్యాఖ్యలు

SMTV Desk 2019-03-11 12:03:36  Ali, pawan Kalyan,

ముంబై, మార్చ్ 11: ఈ రోజు ప్రముఖ హాస్య నటుడు అలీ వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. మెగా హీరో పవన్ కళ్యాణ్ కి అలీ కి గల రిలేషన్ మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో అదే ప్రశ్న అలీకి మీడియా నుంచి ఎదురైంది. పవన్ కల్యాణ్ ను కాదని వైసీపీలో ఎందుకు చేరారంటూ మీడియా ప్రశ్నించగా... ఆయన ఈ విదంగా సమాధానం ఇచ్చారు.

పవన్ కల్యాణ్ తనకు మంచి మిత్రుడని... ఆయన విజయవంతమైతే, నేను కూడా సక్సెస్ అయినట్టే ఫీల్ అవుతానని అలీ తెలిపారు. స్నేహం వేరు, రాజకీయం వేరు అని అన్నారు. అన్ని పార్టీల్లో ఉన్న నాయకులంతా తనకు తెలిసినవాళ్లేనని చెప్పారు. ప్రజలంతా జగన్ రావాలి, జగన్ కావాలి అని కోరుకుంటున్నారని... అందుకే ఆయనకు తనవంతు చేయూతను అందిద్దామని వైసీపీలో చేరానని అన్నారు.

వై ఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి పట్ల ప్రజల్లో విశ్వాసం ఉందని, ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారని తెలిపారు.