అన్నాడీఎంకే-బిజెపి కూటమితో డీఎండీకే పొత్తు!

SMTV Desk 2019-03-11 11:31:53  DMDK chief Vijayakanth getting the agreement papers from AIADMK leaders Edappadi K Palaniswami and O Paneerselvam for the upcoming Lok Sabha Election, Edappadi K Palaniswami, O Paneerselvam , Lok Sab

చెన్నై, మార్చ్ 11: అన్నాడీఎంకే-బిజెపి కూటమితో డీఎండీకే అధినేత విజయకాంత్‌ పొత్తు కుదుర్చుకున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో ఉన్న మొత్తం పార్లమెంట్‌ స్ధానాలు 39 కాగా, పొత్తులో భాగంగా డీఎండీకే పార్టీ నాలుగు లోక్‌సభ స్థానాలకు పోటీ చేయనుంది. కాగా రాష్ట్ర సిఎం పళనిస్వామి, పన్నీరుసెల్వం, విజయకాంత్‌, ఆయన సతీమణి ప్రేమలత మధ్య ఈ ఒప్పందం జరిగింది. మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు, ఒక రాజ్యసభ సీటు ఇవ్వాలని అధికార పార్టీ అన్నాడీఎంకేను డీఎండీకే కోరింది. కానీ అన్నాడీఎంకే నాలుగు లోక్‌సభ స్థానాల్లోనే పోటీ చేయాలని డీఎండీకేకు సూచించింది. పొత్తులో భాగంగా బిజెపి 5 స్థానాలు, డీఎండీకే 4, పీఎంకే 7, పీటీ, ఎన్జేపీ, ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలు తల ఒక స్థానంలో పోటీ చేయనున్నారు. మిగతా స్థానాల్లో అన్నాడీఎంకే పోటీ చేయనుంది.