మరో భక్తి రస చిత్రంలో అనుష్క

SMTV Desk 2019-03-11 11:04:36  Anushka shetty, silence, om namo venkateshaya

హైదరాబాద్, మార్చి 11: దళపతి , స్పైడర్‌ , తుపాకీ వంటి చిత్రాలకు పని చేసిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ సంతోష్‌ శివన్‌ దర్శకత్వ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. త్వరలో ఓ భక్తి కథా చిత్రం తెరకెక్కిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ చిత్రం తెలుగు, మలయాళ, తమిళ భాషల్లో రూపొందుతోంది. ఈ చిత్రంలో అనుష్క కీలక పాత్ర పోషించనుందట. కానీ ఇంతవరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడం గమనార్హం. శబరిమల ప్రాముఖ్యతను తెలుపుతూ అయ్యప్ప స్వామి కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు.

గతంలో అనుష్క ఓం నమో వెంకటేశాయ చిత్రంలో కృష్ణమ్మగా కనిపించి మెప్పించింది. ఆ సినిమా జయాపజయాలు పక్కన పెడితే అనుష్క పాత్రకు ప్రశంసలు కూడా లభించాయి. ఇప్పుడు కూడా మళ్ళీ అలాంటి పాత్రలోనే అనుష్క కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కథ ఈమె చేయనున్న పాత్రతోనే ముడిపెట్టి ఉంటుందట.

ప్రస్తుతం అనుష్క హారర్‌ థ్రిల్లర్‌ సైలెన్స్‌ లో నటిస్తోంది. ఆస్ట్రేలియాలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన తర్వాత బరువు తగ్గిన అనుష్క ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉంది. కోన వెంకట్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు మాధవన్‌ ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.