రెండు రోజుల్లో తొలి జాబితా విడుదల

SMTV Desk 2019-03-11 10:03:11  Tholi Jabitha Janasena, Pawan Kalyan

అమరావతి, మార్చ్ 11: ఉత్కంఠ భరితంగా మారిన ఎన్నికల ప్రక్రియ మొదలైంది. లోక్ సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, ఆరుణాచల్ ప్రదేశే అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూల్‌ విడుదల చేసింది. మొత్తం 7 విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తుండగా తొలి విడతలోనే ఏపీలోని 25 లోక్ సభ స్థానాలతోపాటు శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఇంకా 31 రోజులే ఉన్నందున అన్ని పార్టీలు అభ్యర్థుల ప్రకటనపై దృష్టి సారించాయి.

ఇందులో భాగంగానే అభ్యర్థులపై నిన్న పార్టీ నేతలతో జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ సమీక్ష నిర్వహించారు. రెండు రోజుల్లో తొలి జాబితా విడుదల చేసే దిశగా పవన్ సమాలోచనలు జరిపారు. ఇవాళ లేదా రేపు తొలి జాబితాను ఆయన ప్రకటించే అవకాశం ఉంది. స్క్రీనింగ్ కమిటీ ముందుకు వచ్చిన దరఖాస్తుల నుంచి తొలి జాబితాను పవన్‌ ప్రకటించబోతున్నారు.