అనసూయకి హ్యాట్రిక్ ఖయమా?

SMTV Desk 2019-03-11 10:01:52  Anasuya, Randhir, Dhanraj,

హైదరాబాద్, మార్చి 11: అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్‌ నాదెండ్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం కథనం . అవసరాల శ్రీనివాస్, రణధీర్, ధన్‌రాజ్, ‘వెన్నెల’ కిషోర్, ‘పెళ్లి’ పృథ్వీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ది మంత్ర ఎంటర్‌టైన్మెంట్స్, ది గాయత్రి ఫిల్మ్స్‌ పతాకాలపై బట్టేపాటి నరేంద్ర రెడ్డి, శర్మ చుక్కా నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్‌ని హీరో రామ్‌చరణ్‌ సతీమణి ఉపాసన కొణిదెల విడుదల చేశారు. రాజేష్‌ నాదెండ్ల మాట్లాడుతూ..... క్షణం , రంగస్థలం తర్వాత అనసూయగారు కథనం సినిమాతో హ్యాట్రిక్‌ సాధించబోతున్నారు. ఒక పాట మినహా చిత్రీకరణ పూర్తయింది.ఈ చిత్రానికి సంగీతం: సునీల్‌ కశ్యప్, కెమెరా: సతీష్‌ ముత్యాల, లైన్‌ ప్రొడ్యుసర్‌: ఎమ్‌. విజయ చౌదరి.