మ్యాచ్ ను మలుపు తిప్పిన 'టర్నర్' .. ఆస్ట్రేలియా విజయం

SMTV Desk 2019-03-11 08:43:29  Australia, Turner

మొహాలీ, మార్చ్ 11: నాలుగో వన్డేలో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. భారత్‌పై ఆసీస్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. భారత్ నిర్థేశించిన 359 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లతో పాటు 13 బంతులు మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది. హాండ్స్ కోంబ్ (117) చెలరేగి అద్భుత సెంచరీ చేయడంతో విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఖవాజా 91 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్‌లో కులదీప్ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. టర్నర్ అసలు మ్యాచ్‌నే మలుపు తిప్పాడు. టర్నర్ 43 బంతుల్లో 84 పరుగులు చేయడంతో ఆసీస్ విజయబావుటా ఎగురవేసింది. మ్యాక్స్ వెల్ 23 పరుగులు చేసి కులదీప్ యాదవ్ బౌలింగ్ లో ఎల్ బి డబ్ల్యూ రూపంలో ఔటయ్యాడు. కారే 21 పరుగులు చేసి బుమ్రా బౌలింంగ్ లో శిఖర్ ధావన్ కు క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. మార్ష్ ఆరు పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో క్లీన్ బౌల్డయ్యాడు. ఫించ్ ఒక్కడే డకౌట్ రూపంలో నిష్క్రమించాడు. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు పడగొట్టగా భువనేశ్వర్ కుమార్, కులదీప్, చాహల్ తలో ఒక వికెట్ తీశారు. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా 2-2 రెండు జట్లు సమజ్జీలుగా ఉన్నారు.