అభిమానిని పరామర్శించిన వెంకీ

SMTV Desk 2019-03-11 07:42:00  victory venkatesh, fan suffered with bone censer, lb nagar, hyderabad

హైదరాబాద్, మార్చ్ 10: విక్టరీ వెంకటేష్ తన అభిమాని క్యాన్సర్ తో భాదపడుతుండడంతో తాజాగా అతని దగ్గరికి వెళ్లి పరామర్శించారు. ఎల్.బి.నగర్ కి చెందిన తన అభిమాన సంఘానికి ఉపాధ్యక్షుడిగా పని చేస్తున్న సురేష్ లివర్ క్యాన్సర్ తో బాధ పడుతున్నారు. పూర్తిగా చిక్కి శల్యమైన దశలో అతడికి ఇంకా ఖరీదైన ట్రీట్ మెంట్ కొనసాగుతోంది. సురేష్ వెంకీకి వీరాభిమాని. తన అభిమాని వేగంగా కోలుకోవాలని వెంకీ ఆ కుటుంబానికి అండగా నిలుస్తున్నారట.