మొహాలీ వన్డే : రెచ్చిపోయిన టీం ఇండియా ఓపెనర్స్....

SMTV Desk 2019-03-11 07:21:57  india vs australia, 4th odi, rohit sharma, shikar dhawan

పంజాబ్, మార్చ్ 10: భారత్, ఆసిస్ మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు పంజాబ్ లోని మొహాలీ స్టేడియం వేదికగా 4 మ్యాచ్ మొదలయ్యింది. క్రీజులో అడుగు పెట్టిన దగ్గర నుంచి మంచి పార్టనర్ షిప్ తో జట్టును స్కోర్ కార్డును పరిగెత్తించారు ఓపెనర్స్ రోహిత్, ధావన్. అయితే రోహిత్ 2 సిక్సర్లు, 7 ఫోరులతో విజృంభించి 95 పరుగులు చేసి కేవలం 5 పరుగుల తేడా తో తన సెంచరీని మిస్ చేసుకున్నాడు. రోహిత్ గురి తప్పినా కానీ గబ్బర్ గురి మాత్రం తప్పలేదు. 12 ఫోర్లు ఒక సిక్సర్ బాది కేవలం 97 బంతుల్లోనే తన శతకాన్ని పూర్తి చేసి కంగారులను ఖంగారు పెట్టించాడు. వీరిద్దరి భాగస్వామ్యం వలన ఇప్పుడు భారత జట్టు భారీ లక్ష్యం దిశగా పరుగులు పెడుతుంది.