కరణ్ జోహార్‌తో హార్దిక్ పాండ్యా డ్యాన్స్!

SMTV Desk 2019-03-11 07:14:14  Hardik pandya, KL Rahul, BCCI, Karan johar, Coffee with karan show

ముంబై, మార్చ్ 10: టీం ఇండియా జట్టు ఆటగాడు హార్దిక్ పాండ్యా వెన్ను నొప్పి కారణంగా ప్రస్తుతం ఆసిస్ తో జరుగుతున్న సిరీస్ లకు దూరమయ్యాడు. అయితే ఈ ఏడాది ఆరంభంలో ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో అమ్మాయిలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా హార్దిక్ పాండ్య కొన్నిరోజులు నిషేధం కూడా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే.. బీసీసీఐ పాలకుల కమిటీ ఆ నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేయగా.. ఆ తర్వాత భారత్ జట్టులోకి పునరాగమనం చేసిన హార్దిక్ పాండ్య.. మళ్లీ గాయం కారణంగా టీమ్‌కి దూరమయ్యాడు. ఐపీఎల్ 2019 సీజన్‌కి ఫిట్‌నెస్ సాధించాలని ప్రస్తుతం ట్రై చేస్తున్న హార్దిక్ పాండ్య.. తాజాగా ముంబయిలో జరిగిన ఆకాశ్ అంబానీ - శ్లోకా మెహతా వివాహానికి హాజరై సందడి చేశాడు. తన సోదరుడు కృనాల్ పాండ్యాతో కలిసి వచ్చిన హార్దిక్.. వేదికపై కాసేపు కరణ్ జోహార్‌తో కలిసి డ్యాన్స్ చేశాడు. ఆకాశ్ అంబానీ కుటుంబానికి చెందిన ముంబయి ఇండియన్స్ టీమ్‌కి పాండ్యా బ్రదర్స్ గత మూడేళ్ల నుంచి ఆడుతున్న విషయం తెలిసిందే.