నేడు సాయంత్రం కేంద్ర ఎన్నికల సమావేశం

SMTV Desk 2019-03-11 07:13:10  central election commission, press meeting, lok sabha elections

న్యూఢిల్లీ, మార్చ్ 10: ఈ రోజు సాయంత్రం ఐదు గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియాతో సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్‌ ఎన్నికలతోపాటు మరో 4 రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ ను విడుదల చేయనుంది. లోక్‌ సభ ఎన్నికల షెడ్యూల్‌ మరియు అరుణాచల్‌ ప్రదేశ్‌, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల శాసన సభలకు కూడా ఎన్నికల షెడ్యూల్‌ ను ప్రకటించే అవకాశముంది. లోక్‌ సభ ఎన్నికలను 8 లేదా 9 దశల్లో నిర్వహించాలని ఈసీ యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు రిజిస్టర్‌ కాని 39 పార్టీలకు సాధారణ గుర్తులను కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.