దేశ రక్షణకు సంబంధించిన విషయాన్నీ కూడా రాజకీయం చేస్తుంది, అందుకే రాజీనామా చేశా....

SMTV Desk 2019-03-10 13:40:24  Vinod Sharma, Resigned, Congress, Pulwama Attack, Politics, Central Government

పాట్న, మార్చి 10: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, అధికార ప్రతినిధి వినోద్ శర్మ రాజీనామా చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బీహార్ లో బలహీనంగా ఉండగా, తను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనం సృష్టించింది. తన సొంత పార్టీ అభ్యర్థులే ఇటీవల జరిగిన సర్జికల్ స్ట్రైక్పై పై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడం నచ్చకపోవడంతోనే తాను పార్టీని వీడుతున్నానని ఆయన వెల్లడించారు.

ఇటీవల భారత్-పాక్ మధ్య చోటుచేసుకున్న ఘటనలపై బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. పుల్వామాలో ఉగ్రదాడి తరువాత భారత వైమానిక దళాలు పాక్ లోని ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్ నిర్వహించాయి. ఈ దాడిలో సుమారు 300మంది ఉగ్రవాదులు హతమయ్యారని కేంద్రం ప్రకటించింది. అయితే బీజేపీ సర్జికల్ స్ట్రైక్ పై తప్పుడు ప్రచారం చేస్తోందని, దీని ద్వారా లోక్ సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇలా దేశ రక్షణకు సంబంధించిన విషయాల్లో కూడా కాంగ్రెస్ నాయకులు రాజకీయాలు చేయడాన్ని తట్టుకోలేకపోయానని శర్మ తెలిపారు.

"వైమానిక దళాలు జరిపిన దాడులకు కాంగ్రెస్‌ పార్టీ ఆధారాలు అడిగింనందుకు ఆపార్టీ వ్యక్తిగా సిగ్గుపడుతున్నా. పార్టీ తీరుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నా" అని వినోద్ శర్మ పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కి పంపినట్లు తెలిపారు.