జోరు పెంచిన గల్లా జయదేవ్...

SMTV Desk 2019-03-10 10:09:38  Galla Jayadev, Party Meeting, Party Cadre, Polls, MP

అమరావతి, మార్చి 10: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి గల్లా జయదేవ్ జోరు పెంచారు. పార్టీలో నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గుంటూరు లోక్ సభ నియోజకవర్గంలో ఉన్న 5 అసెంబ్లీ స్థానాలను ఆశిస్తున్న నేతలతో వేర్వేరుగా భేటి అయ్యారు.

ఈ సమావేశానికి టీడీపీ నాయకులూ డొక్కా మాణిక్యవరప్రసాద్, కోవెలమూడి రవీంద్ర, మద్దాళి గిరిధర్, మన్నవ మోహనకృష్ణ, గంజి చిరంజీవి, మెహబూబ్‌ షరీఫ్‌, కూచిపూడి విజయమ్మ, మురుగుడు హనుమంతరావు, జంగాల సాంబశివరావు, షేక్‌ షౌకత్‌, కాండ్రు కమల తదితరులతో సమావేశమై పార్టీ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ నేపథ్యంలో నాయకుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అధిష్ఠానం ఎవరికి టికెట్ ఇచ్చినా అభ్యర్థి గెలుపుకోసం అందరూ కృషి చేయాలని ఆదేశించారు.