రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబునాయుడు

SMTV Desk 2017-08-07 11:25:05  Chandrababu Naidu, Andhra Pradesh Cheif minister, Raksha bhandan

అమరావతి, ఆగష్ట్ 7: సోదర, సోదరీమణుల అనుబంధానికి నిర్వచనంగా జరుపుకునే రాఖీ పండుగ అందరి జీవితాల్లో సుఖసంతోషాలను నింపాలని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కోరారు. రాఖీ పండుగ జరుపుకుంటున్న తెలుగు రాష్ట్రాల ప్రజలందరికి ఆయన సామాజిక మాధ్యమ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ర‌క్షా బంధ‌న్ జ‌రుపుకుంటున్న వారందరికీ నా హృద‌య‌పూర్వ‌క శుభాకాంక్షలు అని చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.