కేఏ పాల్ జ్యోస్యం..: జగన్ జన్మలో ఏపీ సీఎం కాలేరు

SMTV Desk 2019-03-10 09:48:36  Jagan, ka paul,

అమరావతి, మార్చ్ 10: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు జగన్‌పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మండిపడ్డారు. జగన్ జన్మలో ఏపీ సీఎం కాలేరన్నారు. ఒక్కో సీటుకు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టినా వైసీపీ గెలవదని పేర్కొన్నారు. దళితులు, మైనార్టీలు వైసీపీని వీడుతున్నారని తెలిపారు. హెలికాప్టర్.. ఫ్యాన్ గుర్తులు ఒకేలా ఉన్నాయని ఈసీకి ఫిర్యాదు చేశారన్నారు. రెండు గుర్తులకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.కేఏ పాల్‌ని చూస్తుంటే వైసీపీ నేత‌లు భ‌య‌ప‌డుతున్నార‌ని, ప్ర‌స్తుతం రాష్ట్రంలో ప్ర‌జ‌శాంతి పార్టీ హ‌వా న‌డుస్తోంద‌న్నారు , దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న పార్టీనే విజ‌యం సాధించి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తామ‌ని కేఏ పాల్ అన్నారు. మ‌రి కేఏ పాల్ వ్యాఖ్య‌ల పై వైసీపీ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.