మూడు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయట?

SMTV Desk 2019-03-10 09:46:22  Surjical strike,

కేంద్రం హోంమంత్రి రాజ్‌నాధ్ సింగ్ శనివారం కర్ణాటక రాష్ట్రంలో జరిగిన బిజెపి సభలో చాలా ఆశ్చర్యకరమైన విషయం బయటపెట్టారు. “2016లో ఒకసారి మళ్ళీ 2019లో మరోసారి రెండుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగినట్లు భారత్‌ ప్రజలందరికీ తెలుసు. కానీ గత ఐదేళ్ళలో మూడుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి! అప్పుడు కూడా మన వాయుసేనే పాల్గొంది. అయితే ఆ విషయం గురించి ఇప్పుడు ప్రస్తావించదలచుకోలేదు. బాలాకోట్‌లో ఉగ్రవాద శిబిరాలపై మన వాయుసేన దాడి చేసి శత్రువులను తుదముట్టించి వస్తే వారిని అభినందించకపోగా, కాంగ్రెస్‌ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తుండటం చాలా దారుణం,” అని అన్నారు.

రెండుసార్లు సర్జికల్ స్ట్రైక్స్ జరిగినట్లు అందరికీ తెలుసు. కానీ మరోసారి ఎప్పుడు జరిగిందో ఎవరికీ తెలియదు. కేంద్రప్రభుత్వం దాని గురించి అంత గోప్యత పాటించవలసిన అవసరం ఏమిటో తెలియదు. రెండు సర్జికల్ స్ట్రైక్స్ గురించి బాహాటం చెప్పుకొన్నప్పుడు మూడవ స్ట్రైక్ విషయంలో కేంద్రప్రభుత్వం అంత గోప్యత ఎందుకు పాటించింది? అనే ప్రశ్నకు హోంమంత్రి రాజ్‌నాధ్ సింగ్ జవాబు చెప్పాలి.