నాని గ్యాంగ్ లీడర్ టైటిల్ ఎలా వాడుతారు ?

SMTV Desk 2019-03-10 09:44:18  Nani,

నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రం కె కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా టైటిల్ గా గ్యాంగ్ లీడర్ అని పెట్టారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు గ్యాంగ్ లీడర్ టైటిల్ పెట్టడంతో మెగా ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. ఆ టైటిల్ వాడితే మెగా హీరోలే వాడాలని మెగా ఫ్యాన్స్ గొడవ అయితే ఇదిలాఉంటే ఆల్రెడీ గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ తో నిర్మాత మోహనకృష్ణ 6 నెలల క్రితమే టైటిల్ రిజిస్టర్ చేయించాడట.

తన పర్మిషన్ లేకుండా గ్యాంగ్ లీడర్ టైటిల్ ఎలా వాడుతారని అంటున్నాడు మోహన కృష్ణ. ఈ సినిమా టైటిల్ మెగా హీరోలైతే ఇస్తే కాని నానికి ఇవ్వనని అంటున్నాడు. అంతేకాదు గ్యాంగ్ లీడర్ టైటిల్ తో తాను ఓ సినిమా చేస్తున్నానని.. ఉగాది నుండి 40 రోజుల పాటు గోదావరి జిల్లాల్లో షూటింగ్ చేస్తానని చెబుతున్నాడు మాణిక్యం మూవీస్ అధినేత మోహకృష్ణ. మరి గ్యాంగ్ లీడర్ టైటిల్ నానికి ఇస్తారా లేక నిజంగానే ప్రొడ్యూసర్ కం హీరో మోహనకృష్ణకే వదిలేస్తారా అన్నది చూడాలి.