అంగరంగ వైభవంగా ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా వివాహం

SMTV Desk 2019-03-10 09:43:06  Akas Ambani

ముంబయి: రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ పెళ్లి వేడుక ముంబైలో అంగరంగవైభవంగా జరుగుతోంది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన పెళ్లివేడుక పరిసరాలు.. బంధుమిత్రులతో, అతిథులతో కళకళలాడుతున్నాయి. ఆకాశ్, శ్లోకాల వివాహ వేడుకకు బాలీవుడ్ స్టార్స్, క్రికెటర్స్ తోపాటు ప్రముఖ రాజకీయ ప్రముఖులు, అంతర్జాతీయ అతిథులు సైతం తరలివచ్చారు. ఈ పెళ్లికి వచ్చిన బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్, భార్య చెరీ బ్లేయర్‌ దంపతులకు అంబానీ దంపతులు వారికి సాదర స్వాగతం పలికారు. ఇక గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, భార్య అంజలీ పిచాయ్‌తో కలిసి హాజరయ్యారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు.