అపురూపమైన పేగు బంధం!!

SMTV Desk 2017-06-01 17:52:30  california, bear, mother and child bear

కాలిఫోర్నియా, జూన్1 : సాంకేతికత, సమకూరుతున్న వసతులు ఇత్యాధి మూలంగా సమాజంలో డబ్బే ప్రధానంగా మారిపోయింది. ప్రేమ, అప్యాయతలు పూర్తిగా కనుమరుగయ్యాయి. అక్కడక్కడా బిడ్డల్ని విసిరేసి పేగుబంధం కూడా త్రేంచుకుంటున్న రోజులు చూస్తున్నాం.. అయినా పేగుబంధం అపురూపమైనదే...అంతకు మించిన ఆత్మీయ బంధం మరోటి లేదనేది ఎప్పటికప్పుడు సుస్పష్టం అవుతునే ఉంటుంది. మనుషులకే కాదు మూగ ప్రాణులైన జంతువులకూ తమ సంతానంపైన వాత్సల్యం, ప్రేమ ఉంటుందని చాటి చేప్పే ఘటన ఒకటి కాలిఫోర్నియాలోని అల్టాదేనాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన చిత్రాలు అంతర్జాలంలో హల్ చల్ చేస్తున్నాయి. అల్టాదేనాలోని ఓ ఇంటి వెనుక భాగంలో పెద్ద ఎలుగుబంటి ప్రత్యక్షం అయింది. ఆ ఎలుగుబంటిని చూసిన ఇంటియజమానురాలు వణికిపోయింది. కాని, ఆ ఎలుగు తన బిడ్డను ప్రహారీని దాటించేందుకు పడుతున్న కష్టాన్ని చూసి అశ్చర్యపోయింది. వెంటనే వీడియో తీసి అంతర్జాలంలో పోస్ట్ చేసింది. తల్లి ఎలుగుబంటి సునాయసంగా ప్రహారీ ఎక్కగలిగింది. కాని పిల్ల ఎలుగుబంటి మాత్రం ఎక్కలేక ప్రహరీ గోడ కిందుగానే ఉండిపోయింది. అప్పుడు తల్లి గోడ మీద నుండి బాగా కిందికి వంగి బిడ్డకు సాయం చేస్తున్న దృశ్యం అందర్ని అబ్బురపరుస్తోంది.