రాహుల్ గాంధీ బహిరంగసభ హైలైట్స్

SMTV Desk 2019-03-10 09:39:43  Rahul Gandhi,

శనివారం సాయంత్రం శంషాబాద్‌ వద్ద జరిగిన కాంగ్రెస్‌ బహిరంగసభలో రాహుల్ గాంధీ దేశప్రజలపై హామీల వర్షం కురిపించారు. తమ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశ ప్రజల కోసమే ఏమేమి చేయబోతోం రాహుల్ గాంధీ వివరించారు.

1. కులమత ప్రాంతాలతో సంబందంలేకుండా పేద ప్రజలందరికీ కనీస ఆదాయ పధకాన్ని కల్పిస్తాము. కేంద్రప్రభుత్వం నుంచి ప్రతీ పేదవాడికి డబ్బు అందేలా ఒక పాలసీని అమలుచేస్తాం.

2. దేశంలో పేదవారిని వెతికి వెతికి పట్టుకొని వారికి ఆ డబ్బు అందజేస్తాం.

3. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గబ్బర్ సింగ్ టాక్స్ (జిఎస్టీ)ని సరళతరం చేసి చిరువ్యాపారులకు సైతం దాని వలన మేలు కలిగేలా మార్చుతాము.

4. చిరు వ్యాపారాలు చేసేవారందరికీ తప్పనిసరిగా బ్యాంక్ రుణాలు ఇచ్చే విధంగా నిబందనలు రూపొందిస్తాం.

5. భారీగా ఉద్యోగకల్పన చేస్తాం.

6. చట్టసభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును ప్రవేశపెడతాం.

7. చైనా ముందు నేను మోడీలా తలదించుకొని ఉండను.

ఈ సభలో రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కూడా తీవ్ర విమర్శలు చేశారు.

కేసీఆర్‌ అవినీతి చిట్టా మోడీ చేతుల్లో ఉంది. అందుకే నోట్లరద్దు, జిఎస్టీల వలన సామాన్య ప్రజలు రోడ్డున పడుతున్నా, రఫెల్ యుద్ధవిమానాల కొనుగోలులో మోడీ ప్రభుత్వం వేలకోట్ల అక్రమాలకు పాల్పడినా, పార్లమెంటులో మోడీ ప్రభుత్వం ఏవిధంగా వ్యవహరించినా కేసీఆర్‌ మద్దతు ఇస్తుంటారు కుదరకపోతే మౌనం వహిస్తుంటారు,” అని విమర్శించారు.