ఎంపీ కవిత సమక్షంలో తెరాస తీర్థం పుచ్చుకున్న కాంగ్రెస్ నాయకులు

SMTV Desk 2019-03-10 09:33:30  trs, kavita, congress

నిజామాబాద్, మార్చ్ 09: శనివారం నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత జగిత్యాల నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆవిడ సమక్షంలో నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల కాంగ్రెస్ సర్పంచ్ లు టీఆర్ఎస్ లో చేరారు. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయంలో ఈ చేరికల కార్యక్రమం జరిగింది. అలాగే బీర్పూర్ మండలం తాళ్ళ ధర్మారం తాళ్ల ధర్మారం సర్పంచ్ నల్ల మహిపాల్ రెడ్డి, ఉప సర్పంచ్ దూస ఎల్లక్కలతో పాటు వార్డు సభ్యులకు కవిత గులాబి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే చిత్ర వేణి గూడెం సర్పంచ్ సుగుణ మారుతి, ఉపసర్పంచ్ చిక్రం భీమా, వార్డు సభ్యులు...రంగసాగర్ గ్రామ సర్పంచ్ బొడ సాగర్ స్వప్న, కండ్ల పల్లి గ్రామ సర్పంచ్ పర్వతం రమేష్ గౌడ్, ఉప సర్పంచ్ రామడుగు శ్రీనివాస్ తో పాటు వార్డు మెంబర్లకు ఎంపీ టీఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.