మాకు వారు అలా చెప్పడం వల్లే ఓడిపోయాం : కోహ్లీ

SMTV Desk 2019-03-10 09:32:31  india vs australia, 3rd odi, virat kohli

రాంచీ, మార్చ్ 09: ఆసిస్ తో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా నిన్న రాంచీలో జరిగిన మూడో వన్డేలో టీం ఇండియా ఘోరంగా పరాజయ పాలైన సంగతి తెలిసిందే. అయితే ఓటమిపై స్పందించిన టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తక్కువ వ్యవధిలో వికెట్లు కోల్పోవడాన్ని మళ్లీ చూడదల్చుకోలేదని అన్నారు. తమ అంచనాలు తప్పడం వల్లే ఓటమి చవిచూశామని, తమ కన్నా అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు విజయానికి అర్హులని అన్నాడు. అయితే, రాత్రి 7.30 సమయంలో మంచు ప్రభావం చూపిస్తుందని తమకు ఎవరో చెప్పారని, అందుకే ముందు బౌలింగ్‌ ఎంచుకున్నామని, కానీ అలాంటిదేమీ జరగలేదని కోహ్లీ అన్నాడు. తాము గెలుస్తామని అనుకున్నా గానీ ఆసీస్‌ ఆటగాళ్లు తమ కన్నా అద్భుత ప్రదర్శన కనబర్చారని, ఆడమ్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడని, వారు ఈ విజయానికి అర్హులని కోహ్లీ అన్నాడు.