మేం కూడా భారత్ కు నిరసనగా నలుపు బ్యాండ్‌లు ధరిస్తాం : పాక్

SMTV Desk 2019-03-09 18:19:04  indian team, australia vs india, odi, pakistan government, pakistan minister pawad choudary

ఇస్లామాబాద్, మార్చ్ 09: శుక్రవారం ఆసిస్ తో జరిగిన మ్యాచ్ లో టీం ఇండియా ఆటగాళ్ళు పుల్వామా దాడిలో వీర మరణం పొందిన జవాన్లకు నివాళిగా ఆర్మీ టోపీలను ధరించిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై పాకిస్థాన్‌ మంత్రి పవాద్‌ చౌదరీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భారత టీం క్రికెట్‌ను రాజకీయం చేసిందంటూ దీనిపై చర్యలు తీసుకోవాలని ఐసీసీ(ఇంటర్నేషనల్‌ క్రికెట్ కౌన్సిల్‌)ను పాక్‌ మంత్రి పవాద్‌ చౌదరీ కోరారు. భారత్‌ చేసిన ఈ చర్యకు నిరసనగా ఐసీసీ ముందు ఫిర్యాదు చేయాలని ఆయన పీసీబీ(పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు)కు విన్నవించారు. కాగా ఇలాగే తదుపరి మ్యాచుల్లో కూడా భారత టీం ఆర్మీ క్యాప్‌లను ధరించటం కొనసాగిస్తే పాక్ టీం కూడా కశ్మీర్‌లో దురాగతాలకు పాల్పడుతున్న భారత్‌కు నిరసనగా నలుపు బ్యాండ్‌లు ధరిస్తారని చెప్పారు.