శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసిన అక్బరుద్దిన్

SMTV Desk 2019-03-09 17:45:25  akbaruddin owaisi, mim, trs, telangana legislative assembly

హైదరాబాద్, మార్చ్ 09: ఈ రోజు తెలంగాణ శాసనసభలో అక్బరుద్దిన్ స్పీకర్ చాంబర్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి సమక్షంలో ఆయన ఉర్ధూలో ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సభాపతి టి. పద్మారావు గౌడ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, శాసనసభ కార్యదర్శి వి. నరసింహా చార్యులు పాల్గొన్నారు. గతంలో సొంత పార్టీ ఎమ్మెల్యే ముంతాజ్ ఖాన్ ప్రోటెం స్పీకర్ గా ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయించిన సమయంలో అక్బరుద్దిన్ సభకు హజరు కాలేకపోయారు. దీంతో ఇవాళ స్పీకర్ సమక్షంలో ప్రమాణస్వీకారం చేయాల్సివచ్చింది. అక్బరుద్దిన్ ఇప్పటివరకు ఐదుసార్లు (1999, 2004, 2009, 2014, 2018) ఎమ్మెల్యేగా గెలుపొందారు.