తెలంగాణ రాష్ట్రంలో రేపు పల్స్ పోలియో

SMTV Desk 2019-03-09 16:20:51  pulse polio drops telangana, pulse polio drops

హైదరాబాద్‌, మార్చ్ 09: తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 10న పల్స్ పోలియో కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 35,12,333 మంది పిల్లల్కఉ పోలియో చుక్కలు వేసేందుకు ఆయా విభాగాలకు అవగాహన కల్పించి, 52,19,180 వ్యాక్సినేషన్‌ డోస్‌లు సిధ్ధం చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖ, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, పాఠశాల విద్యాశాఖ, పంచాయితీరాజ్‌, ఐకెపి, డిఫెన్స్‌, నేవీ, ఆర్టీసి శాఖల సమన్వయంతో పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రయాణాల్లో ఉన్నవారికి 787 సంచార బృందాల ద్వారా అన్ని బస్టాండ్లలో, రైల్వేస్టేషన్లలో, ప్రధాన కూడళ్లలో చుక్కలమందు వేస్తారు.