ఆసిస్-భారత్ : చివరి రెండు వన్డేల్లో ధోనికి విశ్రాంతి!

SMTV Desk 2019-03-09 16:19:24  ms dhoni, indian ex captain, team india, india vs australia odi, sanjay bangar

న్యూఢిల్లీ, మార్చ్ 09: భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ప్రస్తుతం ఆసిస్ తో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా చివరి రెండు వన్డేలకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు భారత బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ తెలిపారు. రాంచిలో జరిగిన మ్యాచ్ అనంతరం ఈ విషయాన్ని సంజయ్ వెల్లడించారు. ఇప్పటికే సిరీస్‌ 2-1 ఆధిక్యంలో ఉన్న భారత్‌.. ఈ నెల 10న మొహాలిలో.., 13న ఢిల్లీలో జరిగే వన్డేలకు ధోనికి విశ్రాంతి ఇస్తూ అతని స్థానంలో యంగ్‌ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ కు తీసుకోనున్నట్లు సంజయ్‌ వెల్లడించారు. మరోవైపు ఆసీస్‌ తో సిరీస్‌ ముగిసిన తర్వాత.. టీమిండియాకు మరో జట్టుతో మ్యాచుల్లేవు. కేవలం ఐపీఎల్‌ మ్యాచులు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్‌ దృష్ట్యా కీలక ఆటగాళ్లు బీసీసీఐ విశ్రాంతి ఇస్తోంది.